మేయర్, ఛైర్మన్ పరోక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల

మేయర్, ఛైర్మన్ పరోక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల
x
మేయర్, ఛైర్మన్ పరోక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల
Highlights

రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి...

రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల మేయర్, ఛైర్మన్ పరోక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేస్తారు. అదే రోజు 12 గంటలా 30 నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను పరోక్ష పద్దతిలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను పర్యవేక్షించే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టారు. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటీసును ఈ నెల 25న జారీ చేయనున్నారు అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories