పనిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

పనిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
x
మేయర్ బొంతు రామ్మోహన్
Highlights

హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్‌ఎంసీ జోనల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్‌ఎంసీ జోనల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు, చెత్తా చెదారం పేరుకుపోతున్నాయని అధికారులు సమర్థవంతంగా పనిచేయడం లేదని మండిపడ్డారు. జోనల్ పరిధిలోని చాలా మంది అధికారులు వారి పనిపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, వాటికి సంబంధించిన విషయాలన్నీ తమ దృష్టికి వచ్చాయని మేయర్ తెలిపారు.

ఎవరైతే పని పట్ల నర్లక్ష్యం వహిస్తారో వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో కోటి మందికి పైగా జనాభా ఉన్నారని ఆయన స్ఫష్టం చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులు 20,000 కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. నగరంలో పర్యావరణాన్ని పెంచడానికి ఇప్పటివరకూ 44 లక్షల డస్ట్ బిన్స్ ఇచ్చామని ఆ‍యన తెలిపారు. కానీ జీహెచ్ ఎంసీ సిబ్బంది మాత్రం వ్యర్థాలను సేకరించడానికి వెళ్లడం లేదని ఆ‍యన అన్నారు.

దీంతో కాలనీలలో కాలుష్యం పెరిగిపోయి స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. నగరంలో చెత్త పేరుకుపోకుండా అధికారులు దృష్టి సారించాలని ఆయన తెలిపారు. నగరంలోని అన్ని కాలనీలలో క్లీన్‌డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దీంతో స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories