హైదరాబాద్ మేయర్: పేదలకు సాయం చేయాలనుకుంటే సెంట్ర‌లైజ్డ్ వింగ్‌ను సంప్రదించండి

హైదరాబాద్ మేయర్:  పేదలకు సాయం చేయాలనుకుంటే సెంట్ర‌లైజ్డ్ వింగ్‌ను సంప్రదించండి
x
Highlights

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది పేదలు కష్టాలను ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది పేదలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారి కష్టాలని చూడలేక కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు వారికి తగిన సాయం చేసి అండగా ఉండడానికి ముందుకు వచ్చాయి. పేదలు, కూలీలను నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఫుడ్ ప్యాకెట్లు అందిస్తూ తామకు తోచిన సాయం చేస్తున్నారు.

కూలీలందరూ వాటిని అందుకోవడానికి గాను గుంపులు గుంపులుగా నిలుచుంటున్నారు. దీంతో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేదలకు సాయం చేస్తున్నవారికి కొన్ని కీలక సూచనలు చేశారు. పేదలకు సాయం చేయడం ఎంతో మంచిదని, కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం ప్రమాదం అని అన్నారు. దీంతో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

ఎవరైనా పేదలకు సాయం చేయాలనుకుంటే జీహెచ్ఎంసీని సంప్రదించాలని ఆయన తెలిపారు. దాతల నుంచి బియ్యం, ఆహారాన్ని సేక‌రించడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ విభాగాన్ని అద‌న‌పు క‌మిష‌న‌ర్ ప్రియాంక ఆధ్వ‌ర్యంలో నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. దాతల నుంచి ఈ విభాగం వారు వస్తువులను సేకరించి అవసరమైన ప్రజలకు న‌గ‌ర వ్యాప్తంగా ప‌ది మొబైల్ వాహ‌నాల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. ఎవరైనా సాయం చేయాలనుకుంటే సెంట్ర‌లైజ్డ్ వింగ్‌కు స‌మాచారం ఇస్తే మొబైల్ వాహ‌నాల ద్వారా వాటిని అధికారులు సేకరించి, బియ్యం, ఆహారాన్ని ప్రజలకు పంపినీ చేస్తుందని తెలిపారు.

జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఎవరైనా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తే దాత‌లు, వ్య‌క్తుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. ఇక వేల సేవాసమితిలు తాత్కాలిక షెల్ట‌ర్ హోమ్‌ల‌లో ఉంచిన వలస కార్మికులు, నిరాశ్ర‌యులు, అనాథ‌ల‌కు మాస్కులు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తే జీహెచ్‌ఎంసీ ప్ర‌త్యేక విభాగాన్ని సంప్రదించాలన్నారు. దాతలు twitter@PDUCD_GHMC, ట్విటల్ అకౌంట్ ద్వారా లేదంటే మొబైల్ నెం: 94931 20244, 70939 06449ల‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories