Top
logo

రెడ్డిపల్లిలో రౌడీ టీచర్‌

రెడ్డిపల్లిలో రౌడీ టీచర్‌
Highlights

విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. అకృత్యాలకు,...

విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. అకృత్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది.

అటు పిల్లలకు, ఇటు సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు విద్యార్ధుల ముందే వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసమూర్తి, మ్యాథ్స్ మాస్టర్ దేవరుషిపై దాడికి దిగాడు. కంట్లో కారం చల్లి అటాక్ చేశాడు. దాంతో, మిగతా ఉపాధ్యాయులు, లేడీ టీచర్లు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసమూర్తి గతంలోనూ ఇదేవిధంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చామని హెడ్మాస్టర్ దేవయ్య చెబుతున్నారు. శ్రీనివాసమూర్తి వ్యవహార శైలితో ఇటు టీచర్లు, అటు స్టూడెంట్స్ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని దేవయ్య తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్కులను ఆన్ లైన్ చేయమని చెప్పినందుకే తనపై శ్రీనివాసమూర్తి దాడి చేశాడని మ్యాథ్స్ టీచర్ దేవరుషి అంటున్నారు. తన కంట్లో కారం చల్లి అటాక్ చేయడంతో మిగతా టీచర్లు తనను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారని తెలిపాడు.

ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసమూర్తి వ్యవహార శైలిపై విద్యార్ధులు కూడా మండిపడుతున్నారు. అసలు స్కూల్ కి రారని, వచ్చినా పాఠాలు చెప్పరని, బూతులు తిడతారని అంటున్నారు. ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసమూర్తిపై ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హెడ్మాస్టర్ దేవయ్య తెలిపారు. అయితే, శ్రీనివాసమూర్తి తీరుపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Web TitleMaths Teacher Attacking on Physics Teacher
Next Story