బీరుకు మంజీరా నీరుకు ఉన్న లింకేంటి ?

బీరుకు మంజీరా నీరుకు ఉన్న లింకేంటి ?
x
Highlights

మంజీరా నది ఎండిపోవడంతో తాగునీరే కాదు బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మండుతున్న ఎండలతో చల్లని బీరు సేవించి ఉపశమనం పొందాలనుకుంటున్న వారు బావురుమంటున్నారు...

మంజీరా నది ఎండిపోవడంతో తాగునీరే కాదు బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మండుతున్న ఎండలతో చల్లని బీరు సేవించి ఉపశమనం పొందాలనుకుంటున్న వారు బావురుమంటున్నారు మంజీరా నది నీరుకు బీరుకు మధ్య సంబంధం ఏమిటీ? మంజీరాలో నీరు తగ్గితే బీరు సరఫరాకు ఎందుకు బ్రేక్ పడింది? బీరుకు మంజీరా నీరుకు ఉన్న లింకేంటి ?

స్వచ్ఛమైన నీటికి కేరాఫ్ మంజీరా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు జంటనగరాలకు ఇక్కడి నుంచే తాగునీటిని సరఫరా చేస్తారు. మంజీరా నీటికున్న విశిష్ట లక్షణంతో సంగారెడ్డి సమీపంలో పలు బీరు తయారీ కంపెనీలు స్థాపించారు. ఒక్కో బీరు పరిశమకు ప్రతి రోజు వెయ్యి కిలో లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ అవసరం ఉంటుంది. హైదరాబాద్ మెంట్రో వాటర్ వర్క్ ద్వారా ఈ పరిశ్రమలకు నీరు అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగూరు ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పడిపోయింది. మూడు నెలల క్రితం నీటి విడుదల నిలిపి వేశారు.

మండుతున్న ఎండలకు మంజీరా ఎండిపోయింది. తాగు నీటి కష్టాలే కాకుండా బీరు సరఫరాకు బ్రేక్ పడింది. ప్రస్తుతం మంజీరా బ్యారేజీలో చుక్క నీరు లేదు. రెండు నెలలుగా ఇక్కడి బీరు పరిశ్రమలకు నీటిని నిలిపి వేశారు. బీర్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ వేసవిలో 30 శాతం ఉత్పత్తి తగ్గినట్లు బీరు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మద్యం సరఫరాచేసే ఐఎంఎల్ డిపోల్లో బీర్ల కొరతతో వైన్ షాపులకు రేషన్ పై బీర్ కాటన్ లను పంపిణీ చేస్తున్నారు. వేసవి కాలంలో బీర్లకు డిమాండ్ ఉన్న నేపధ్యంలో బీర్లు సరఫరా నిలిచిపోవడంతో లిక్కర్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు వినియోగాదారుల నుంచి వస్తున్న డిమాండ్ ను తట్టుకోవడానికి వైన్ షాపు యజమానులు ఒకరికి రెండు బీర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. మరో వైపు బీరు ఉత్పత్తి తగ్గడంతో ఉపాధి అవకాశాలు సైతం తగ్గిపోయాయి. రోజూ వందల సంఖ్యలో బీర్ పరిశ్రమల్లో పని చేస్తూ ఉపాది పొందుతున్న కార్మికులు పని లేక భవిశ్యత్తు అగమ్యగోచరంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories