కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం : మందకృష్ణ మాదిగ

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం : మందకృష్ణ మాదిగ
x
Highlights

తెలంగాణా ప్రబుత్వం మరియు ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఎమ్మార్పీఎస్‌ అద్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు .. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని...

తెలంగాణా ప్రబుత్వం మరియు ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఎమ్మార్పీఎస్‌ అద్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు .. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పంజగుట్టలో కూల్చిన చోటనే తిరిగి ప్రతిష్ఠించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి చెత్తకుప్పలో పారేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. విగ్రహం పెట్టేందుకు అనుమతి లేదన్న సాకుతో ఒక్క రోజులోనే అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించి ముక్కలు చేసి చెత్తకుప్పలో వేశారని, మరి ఆ పక్కనే ఏళ్ల తరబడి ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి అనుమతి ఉందా? అని అయన ప్రశ్నించారు...

తెలంగాణాలో కేసిఆర్ రెండోసారి ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టిన అనంతరం ఎక్కువగా కుల వివక్షతను ప్రోత్సహిస్తున్నారని అయన ధ్వజమెత్తారు .అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించినందుకు నిరసనగా ఎమ్మార్పీఎస్‌ బుధవారం ఇందిరాపార్కు వద్ద దర్నాచౌక్‌లో అంబేడ్కర్‌వాదుల గర్జన మహాసభ ను నిర్వహించింది. అందులో భాగంగా అయన ఈ వాఖ్యలు చేసారు .. తెలంగాణాలో మొదటిసారి అధికారంలోకి వస్తే దళితుణ్ని సీఎం చేస్తానని మోసం చేశారని, ఇప్పుడు రెండోసారి దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్‌నే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులను మోసం చేయడంలో కేసీఆర్‌ నెం.1 మోసగాడు అని ఆరోపించారు. అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రాం, మహాత్మా జ్యోతిబా పూలే జయంతికి హాజరుకాకుండా దళిత, బడుగు బలహీనవర్గాలను అవమానిస్తున్నారని, భవిష్యత్తులో నీ ప్రభుత్వ భరతం పడతామని హెచ్చరించారు.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి హోదాలో 2001 నుంచి 2014 వరకు చంద్రశేఖర్ రావు ఏనాడూ అంబేడ్కర్‌ జయంతి రోజున ఆయన విగ్రహానికి దండ వేయలేదని అన్నారు.

మహాగర్జన సభ నేపథ్యంలో పంజాగుట్ట ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. సభకు వచ్చిన వారంతా అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతంలో నివాళులర్పించడానికి వస్తారనే సమాచారం రావడంతో ఉదయం నుంచే ఐల్యాండ్‌ చుట్టూ ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. పలు దళిత సంఘాలు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి వెళతామని చెప్పినా పోలీసులు అనుమతించలేదు.సభకు వచ్చినవారంతా అంబ్కేడర్‌ మాస్కులు ధరించి, నల్లజెండాలతో నిరసన తెలపడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories