సీరియల్ కిల్లర్..16 హత్యలు

సీరియల్ కిల్లర్..16 హత్యలు
x
Highlights

అతను ఓ కిరాతకుడు.. ఆడవారి ఒంటిపై నగలు కనిపిస్తే చాలు వాటిని ఏ విధంగా దొంగిలించాలి అన్న ఆలోచన అతని బుర్రలో మొదలవుతుంది.

అతను ఓ కిరాతకుడు.. ఆడవారి ఒంటిపై నగలు కనిపిస్తే చాలు వాటిని ఏ విధంగా దొంగిలించాలి అన్న ఆలోచన అతని బుర్రలో మొదలవుతుంది. ఏదో ఒకలా వారితో మాటలు కలిపి మాయ మాటలు చెప్పి మద్యం తాగించేవారు. తరువాత ఎవరూ లేని నిర్మాణుష‌్యమైన ప్రదేశాలకు తీసుకె‌ళ్లి వారిని హత్య చేసేవాడు. మృతుల ఒంటిపై ఎంత బంగారం, వెండి ఉన్నా కాజేసేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 16 హత్యలు చేసాడు. అంతే కాదు అతను హత్యలు చేస్తుంటే అది తప్పు అని వారించాల్సిన అతని భార్య కూడా సపోర్ట్ చేసింది. సాటి ఆడదాన్ని హత్య చేయడానికి సహకరించి ధర్నపత్ని అనిపించుకుంది. అచ్చం అర్జున్ సినిమాలో ఏ విధంగా ఐతే ప్రకాష్ రాజ్ కు, సరిత సాయం చేస్తుందో అలా.. ఇదంతా వింటుంటే ఏదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదూ.. ఏమో ఆ హంతకులు కూడా ఎదో సినిమా చూసి ఇలా స్కెచ్ వేస్తు్న్నారు కాబోలు..

ఈ సంఘటనల గురించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకెలితే మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం గుండేడ్‌ గ్రామంలో ఎరుకుల శ్రీను అతని భార్య నివసిస్తారు. మహిళల ఒంటిపై ఉన్న నగలు డబ్బు కోసం ఇప్పటివరకూ అతను ఏకంగా 16 మందిని హత్యచేసాడు. అంతే కాదు అదే డబ్బు కోసం తోడబుట్టిన సొంత తమ్ముడ్ని కూడా పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసులు అతను. అతనికి తోడు అతని భార్యకూడా ఈ పాపాల్లో పాలు పంచుకుంటుంది.

ముఖ్యంగా ఈ ఇద్దరు మద్యం దుకాణాల దగ్గరకు వెళ్లే మహిళలు, మద్యం తాగే మహిళలను టార్గెట్ చేస్తున్నారు.

ఇదే కోణంలో ఈ నెల అంటే డిసెంబర్ 17న దేవరకద్ర మండలం నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసారు. ఈ హత్యలో పాత నేరస్థుడు ఎరుకల శ్రీను పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. వెంటనే ఆమె మృతదేహాం వద్ద లభించిన ఆధారాలను సేకరించారు. తరువాత శ్రీను కు హత్యతో సంబంధం ఉన్నట్టు నిర్ధారించి అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

అంతేకాదు ఈ విచారణలో మరికొన్ని నిజాలుకూడా బయటపడ్డాయి. ఈ ఒక్క హత్య మాత్రమే కాదని గతేడాది ఆగస్టులో జైలు నుంచి వచ్చిన తర్వాత మిడ్జిల్‌, భూత్పూర్‌, దేవరకద్ర, కొత్తకోట పోలీసు స్టేషన్ల పరిధిలో నాలుగు హత్యలు హత్యచేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని టీఎస్‌ఎండీసీ ఇసుక యార్డులో ఒక మహిళ అస్థిపంజరం బయటపడింది. ఈ హత్యకు పాల్పడింది కూడా శ్రీను అని పోలీసులు నిర్ణయించారు. ఇక తన సొంత తమ్ముడినే 2007లో హత్య చేసి జైలుకు వెళ్లాడు ఆ హంతకుడు. అంతే కాక షాద్‌నగర్‌, శంషాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో మహిళలను హత్యచేసినట్టు కూడా సమాచారం. నిందితుడిపై ఉన్న మొత్తం 18 కేసుల్లో 17 హత్యలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ నేరాలు చేస్తూ బయటికి వచ్చిన శ్రీను తన తమ్ముడిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. తరువాత పరివర్తన కింద అప్పీలు చేసుకుని మూడేళ్లలో బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు కేసుల్లో జైలుకు వెళ్లినా అతని బుద్ధి మాత్రం వక్రబుద్ధిగానే ఉంది. అలివేలమ్మ హత్యకేసులో పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదుచేసుకున్నారు. దాంతో అతను పోలీసులకు ఎదురుతిరిగి తాను పరివర్తనతో బతుకుతున్నానని బుకాయించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories