ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో పంపి వ్యక్తి అదృశ్యం

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో పంపి వ్యక్తి అదృశ్యం
x
Highlights

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకోబోతున్నట్టు సెల్ఫీ వీడియోను తన సన్నిహితులందరికీ పంపి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఖమ్మానికి చెందిన రాయపాటి...

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకోబోతున్నట్టు సెల్ఫీ వీడియోను తన సన్నిహితులందరికీ పంపి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఖమ్మానికి చెందిన రాయపాటి నరసింహారావు అనే వ్యాపారి.. తాను ఎవరెవరికి ఎంత మొత్తం ఇవ్వాలో వివరాలతో కూడిన లేఖను మిత్రులకు వాట్సప్‌లో పోస్ట్ చేశాడు. అలాగే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఓ సెల్ఫీ వీడియోను సైతం మిత్రులకు పంపి కనిపించకుండా పోయాడు. నరసింహారావుకు రూ. 8 కోట్లకు పైగా అప్పులున్నట్టు సమాచారం. తన భర్త ఐధురోజులుగా కనపడడం లేదంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories