Top
logo

గొంతులో చికెన్​ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

గొంతులో చికెన్​ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతిబాబునాయక్
Highlights

గొంతులో చికెన్​ముక్క ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలం ఇందిరానగర్​తండాలో...

గొంతులో చికెన్​ముక్క ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలం ఇందిరానగర్​తండాలో జరిగింది. ఇందిరానగర్​తండాకు చెందిన బాబునాయక్ స్థానిక దాబాకు బుధవారం రాత్రి బంధువులతో కలిసి వెళ్లాడు. చపాతిలో చికెన్ ముక్కను పెట్టుకొని తిన్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. భార్య మీరాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం గొంతులో ఎముక తట్టినట్టు తేలిందని ఎస్సై అనిల్ గౌడ్ తెలిపారు.

Web TitleMan dies after a chicken bone stuck in the throat
Next Story


లైవ్ టీవి