పాలల్లో ప్లాస్టిక్...స్థానికుల ఆందోళన

పాలల్లో ప్లాస్టిక్...స్థానికుల ఆందోళన
x
Highlights

పాలతో పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలు తయారవుతాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో పాలనుంచి ప్లాస్టిక్ కూడా తయారవుతుంది.

పాలతో పెరుగు, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలు తయారవుతాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో పాలనుంచి ప్లాస్టిక్ కూడా తయారవుతుంది. ఏంటి పాల నుంచి ప్లాస్టిక్ తయారవ్వడం ఏంటి అనుకుంటున్నారా. మీరు వింటున్నది నిజమే లీటరు పాల నుంచి సుమారుగు 100 గ్రాముల ప్లాస్టిక్ తయారైంది. రోజూ తాము ఎలాంటి పాలు తాగుతున్నామో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ద్రవ పదార్థంగా ఉన్న పాలు మరిగిస్తే అది ఘనంగా ప్లాస్టిక్‌గా తయారవుతుందంటే అందులో ఏ స్థాయిలో, ఎంత మొత్తంలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారో అంచనా వేసుకుంటూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.

పూర్తివివరాలలోకెళ్తే కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రాజారాం దుబ్బలో అస్లామ్‌ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతను ఓల్డ్‌ బాన్సువాడలో ఉండే ఒక లీటరు పాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. వెంటనే వాటిని కాగబెట్టగా అవి విరిగిపోయాయి. ఆ పాలను పారేయడం ఎందుకని అందులో చెక్కర కలుపుకుని తిందాం అని వాళ్లు పాలను దగ్గరికి చేసారు. ఆ తరువాత అవి కాస్తా ప్లాస్టిక్‌ ముద్దలాగా మారిపోయాయి. ఆ ప్లాస్టిక్ ని చూసిన అస్లామ్ వాసనని గమనించగా అది కూడా ప్లాస్టిక్ లాగానే రావడంతో వెంటనే ఆ ఏరియా డీఎస్పీ కి కంప్లెయింట్ ఇచ్చాడు.

ఫిర్యాదును అందుకున్న డీఎస్పీ వెంటనే స్పందించి అదే పాలకేంద్రం నుంచి మరో లీటర్‌ పాలను తీసుకువచ్చారు. ఆ పాలు విరిగిపోయేలా వేడి చేయగా అవి కూడా ప్లాస్టిక్ ముద్దలా తయారైంది. ఆ పదార్థాన్ని లాగితే సాగడం, భూమికి కొడితే బంతిలా ఎగురుతోంది. దీంతో పాలలో రసాయనాలను కలిపి విక్రయిస్తున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసి, ఆ పాల కేంద్రాన్ని సీజ్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. లీటర్‌కు రూ.60 చొప్పున కొంటున్న పాలలో రసాయనాలు కలుపుతున్నారని అస్లాం ఆవేదన వ్యక్తం చేశాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories