Top
logo

తన తండ్రి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడని...

తన తండ్రి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడని...
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తన తండ్రి మూడో పెళ్లికి సిద్ధం కావడంతో మనస్థాపం చెందిన సందీప్‌ ఆత్మహత్యకు యత్నించాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తన తండ్రి మూడో పెళ్లికి సిద్ధం కావడంతో మనస్థాపం చెందిన సందీప్‌ ఆత్మహత్యకు యత్నించాడు. ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి విద్యానగర్‌లో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నానా హంగామా చేశాడు. తన తండ్రి మూడో పెళ్లితో తల్లి, అక్క, జీవితం అన్యాయమవుతుందన్న ఆవేదనతో వాటర్‌ ఎక్కాడు.

గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఉన్న ఆస్తినంత తాగుడుకే తగలబెట్టాడని ఇదేంటనీ ప్రశ్నించిన తన తల్లిపై చేయి చేసుకున్నాడని యువకుడు వాపోయాడు. తన తండ్రిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతి ఇంటికి వెళ్లి తమ పరిస్థితిని గురించి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఎలాగైనా అధికారులు స్పందించి తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కిందకి దిగనని పట్టుబట్టాడు.

Next Story