చిలుక చోరీ.. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

చిలుక చోరీ.. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
x
చిలుక చోరీ.. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
Highlights

తమ చిలుక చోరీకి గురయ్యిందని హైదరాబాద్ ఎస్సార్ నగర్ కు చెందిన రామలింగేశ్వర్‌ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తాము ఎంతో ప్రేమగా...

తమ చిలుక చోరీకి గురయ్యిందని హైదరాబాద్ ఎస్సార్ నగర్ కు చెందిన రామలింగేశ్వర్‌ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తాము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చిలుకను ఓ గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లాడని పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు చిలక దొంగ కోసం గాలిస్తున్నారు.

పెట‌్ ఎనిమల్స్‌‌ను ఎంతో అపురూపంగా పెంచుకుంటారు ఇక పక్షులను ప్రేమగా ఆదరిస్తారు. ఇంటిలో పక్షుల కిలకిలరాగాలు వింటే మనస్సు ఎంతో పులకరించిపోతుంది. దీంతో చాలామంది ఇంటి ఆవరణలో గూళ్లు ఏర్పాటు చేసి పక్షులను పెంచుకుంటారు. హైదరాబాద్‌ ఎస్.ఆర్. నగర్‌లో రామలింగేశ్వర్‌ రావు చిలుక జాతికి చెందిన ఓ ఆస్ట్రేలియన్‌ కాక్‌టేల్ బర్డ్ ని పెంచుకుంటున్నారు.

దారి వెంట వెళుతున్న ఓ వ్యక్తికి ఈ చిలుకపై కన్ను పడింది. ఎంచక్కా ఆ చిలుకను ఎత్తుకుపోయాడు. ఇంటి ముందు చిలుక కనిపించకపోడంతో యజమాని దిగాలు చెందారు. తన చిలుకను వెతికి పెట్టాలంటూ రామలింగేశ్వర్ రావు ఎస్సార్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా చిలుకను తీసుకెళ్లిన వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories