ఇదో విషాద ఘటన.. సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లిన యువకుడు...

ఇదో విషాద ఘటన.. సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లిన యువకుడు...
x
Representational Image
Highlights

కరోనా వైరస్ మనుషుల ప్రాణాలు కబలించడం మాత్రమే కాదు. మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుతుంది.

కరోనా వైరస్ మనుషుల ప్రాణాలు కబలించడం మాత్రమే కాదు. మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుతుంది. మనిషిలో ఉన్న మానవత్వాన్ని మంటగలిపి, మనసును చంపేస్తుంది. కరోనా వ్యాప్తిని నివారించడానికి పెట్టిన లాక్‌డౌన్లు, సోషల్ డిస్టాన్స్‌లు కొంత మంది నిరుపేదలకు కన్నీరే మిగుల్చుతున్నాయి. మనిషి చనిపోతే మోయడానికి నలుగురు ఉండాలి అంటారు. కానీ కరోనా కారణంగా ఈ నలుగురు కూడా ముందుకు రాలేని దుస్థితి నెలకొంది. ఇలా కన్నీరు పెట్టించే సంఘటనలు ప్రతి రోజు ఎన్నో సంభవిస్తున్నాయి.

ఇలా అందరినీ కంటతడి పెట్టించే మరో సంఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సంఘటనా వివరాల్లోకెళితే నిర్మల్ ఈద్ గావ్‌కి చెందిన మహారాజ్ లింగ్ రాజు(44) బతుకుదెరువుకోసం కామారెడ్డికి వలస వచ్చాడని తెలిపారు. అక్కడే రైల్వేస్టేషన్లో హమాలిగా పనిచేస్తూ పూటగడుపుకునే వాడన్నారు. లాక్‌డౌన్ ఉండటం వల్ల గాంధీ గంజ్ ప్రాంతంలో తలదాచుకుంటున్నాడని తెలిపారు. చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక అలమటించేవాడని, దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడన్నారు.

కాగా శనివారం రాత్రి లింగరాజు ఉన్నట్టుండి చనిపోయాడని తెలిపారు. అతని మృతదేహం ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు కంప్లైంట్ కాల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. అందుకు ఎవరైనా తమకు సాయం చేయమని అడిగినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులకు ఏం చెయ్యాలో అర్థం కాక ఇప్పుడే వస్తామని స్థానికులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత కొద్ది సేపటికి రైల్వేలో అనాథ శవాలకి దహనసంస్కారాలు చేసే యువకుడు రాజు అక్కడకి చేరుకున్నాడు. ఈ మృతదేహాన్ని ఓ బెట్ షీట్ లో చుట్టి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అంబులెన్స్ కి కాల్ చేయగా అవి అందుబాటులో లేనందున రాలేక పోయింది. దీంతో రాజు అక్కడ ఉన్న చాలా మంది వాహనదారుల్ని సాయం అడిగాడు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో చేసేదేమి లేక చివరకు రాజు తన సైకిల్‌పై ఆ మృతదేహాన్ని కట్టి ఆస్పత్రికి తరలించాడు. ఈ విధంగా కరోనా వైరస్ మనుషుల్లో మానవత్వాన్ని చంపి మనసులతో ఆడుకుంటుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories