యువతికి అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్నవ్యక్తి అరెస్ట్

యువతికి అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్నవ్యక్తి అరెస్ట్
x
Highlights

17 ఏళ్ల అమ్మాయికి అసభ్యకర మెజేజ్ లను పంపిస్తున్నాడని 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

17 ఏళ్ల అమ్మాయికి అసభ్యకర మెజేజ్ లను పంపిస్తున్నాడని 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సంఘటన పూర్తివివరాల్లోకెళితే హైదరాబాద్లో నివసిస్తున్న ఒక వ్యక్తి తన స్నేహితుడి కూతురి నంబరును కొన్ని రోజుల క్రితం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఆ యువతికి అసభ్యకరమైన పదజాలాలతో మెసేజ్ లు అశ్లీల చిత్రాలు పంపించం మొదలు పెట్టాడు.

అతని ప్రవర్తనపై విసుగు చెందిన యువతి తన తల్లిదండ్రులకు ఈ విషయం గురించి తెలియజేసింది. దాంతో ఆ యువతి తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అతనిపై లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే చట్టం (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వార్తను ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories