తెలంగాణలో విజృంభిస్తున్న విషజ్వరాలు

తెలంగాణలో విజృంభిస్తున్న విషజ్వరాలు
x
Highlights

తెలంగాణలో వైరల్ ఫీవర్స్ ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగ్యూ వంటి ఫీవర్స్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.

తెలంగాణలో వైరల్ ఫీవర్స్ ఒక్కసారిగా విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగ్యూ వంటి ఫీవర్స్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్‌ తక్కువగా ఉండడం, మరికొన్ని చోట్ల సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని జిల్లాలోని ప్రధాన హాస్పిటల్స్‌లో 24 గంటల ఓపిని అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్‌ ఉస్మానియా హాస్పిటల్ కి రోగులు క్యూ కడుతున్నారు. గత వారం రోజులుగా రోజుకు ఓపి పేషెంట్స్ 12 వందల నుండి 14 వందల వరకూ రోగులు వస్తున్నారని సూపరింటెండెంట్‌ నాగేందర్‌ తెలిపారు. బెడ్స్‌ కొన్ని తక్కువగా ఉన్నాయని, మెడిసిన్స్‌ అన్నీ అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్‌ చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులన్ని రోగులతో కిక్కిరిపోతున్నాయి. ప్రధాన ఆస్పత్రుల్లో ఓపి సమయాన్ని పెంచి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల ఓపి సేవలు కొనసాగుతున్నాయి. విష జ్వరాలు పంజా విసరండంతో ఆసుపత్రిలో ప్రత్యేకంగా జ్వరాల కోసం క్లీనిక్‌ ప్రారంభించారు. సీజనల్ వ్యాధులతో నల్గొండ ప్రభుత్వాసుపత్రి రోగులతో కిక్కరిసిపోతుంది. జలుబు, చలి జ్వరంతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ బాధితులు పెరుగుతున్నారు. నల్గొండ జిల్లా‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇరవై నాలుగు గంటల పాటు అవుట్ పేషంట్ సేవలు అందుబాటులో నడుస్తుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న విషజ్వరాల బాధితులతో ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఒక్కసారిగా పెరిగిన రోగులకు సరిపడా బెడ్స్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories