ఐఏఎస్‌ల భారీ బదిలీలు..ఎందుకంటే..?

ఐఏఎస్‌ల భారీ బదిలీలు..ఎందుకంటే..?
x
ఐఏఎస్‌ల భారీ బదిలీలు..ఎందుకంటే..?
Highlights

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పెద్దఎత్తున బదిలీలు చేపట్టారు. పాలనలో ప్రక్షాళన కోసం 50మంది ఐఏఎస్‌లకు...

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పెద్దఎత్తున బదిలీలు చేపట్టారు. పాలనలో ప్రక్షాళన కోసం 50మంది ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగులు ఇచ్చింది. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం 18మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది. అలాగే, 11మంది జూనియర్ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో పెద్దఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. పాలనలో ప్రక్షాళన కోసం 39మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించారు. జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లో భారీగా బదిలీలు చేశారు. 21మంది కలెక్టర్లతోపాటు 18మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగులు ఇచ్చారు. అలాగే, పలువురు జూనియర్ అధికారులకు కూడా ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పౌసుమి బసు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా అబ్దుల్ అజీమ్‌, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా హరిచందన, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్ హనుమంతు, గద్వాల జిల్లా కలెక్టర్‌గా శృతి ఓజా, కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా ఎంవీ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతామహంతి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా పట్నాయక్‌, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌, నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా ముషరఫ్ అలీ, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా వెంకట్రావ్, ములుగు జిల్లా కలెక్టర్‌ గా కృష్ణ ఆదిత్య, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా వీపీ గౌతమ్‌, వనపర్తి జిల్లా కలెక్టర్‌గా యాస్మిన్ బాషా, జనగామ జిల్లా కలెక్టర్‌గా నిఖిల, జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా రవి, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా పార్థసారథి, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి అండ్ కమిషనర్‌గా బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చిత్రారామచంద్రన్, వ్యవసాయ కార్యదర్శి అండ్ కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి, పశుసవంర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదర్‌సిన్హా, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్‌ సుల్తానియా, నీటిపారుదల ముఖ్యకార్యదర్శిగా రజత్‌కుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా వికాస్‌రాజ్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా, విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శిగా జగదీశ్వర్‌‌కు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.

టీఆర్ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంత పెద్దఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు జరగడం ఇదే మొదటిసారి. అయితే, రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తవడంతో పాలనపై పూర్తిస్థాయి దృష్టిపెట్టడానికే భారీ స్థాయిలో ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, త్వరలో మరికొంత మంది ఐఏఎస్‌లను బదిలీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories