మహబూబాబాద్ పోలీసుల ఓవర్ యాక్షన్..ఎంపీటీసీని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు

మహబూబాబాద్ పోలీసుల ఓవర్ యాక్షన్..ఎంపీటీసీని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు
x
Highlights

మహబూబాబాద్ పోలీసులు ఓ ప్రజాప్రతినిధి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఓ యాక్సిడెంట్ కేసులో బాధిత కుటుంబానికి బాసటగా నిలిచిన ఎంపీటీసీ విక్రమ్ రెడ్డిని...

మహబూబాబాద్ పోలీసులు ఓ ప్రజాప్రతినిధి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఓ యాక్సిడెంట్ కేసులో బాధిత కుటుంబానికి బాసటగా నిలిచిన ఎంపీటీసీ విక్రమ్ రెడ్డిని తొర్రూరు పోలీసులు రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాక సీఐ చేరాలు, ఎస్ఐ మునీరుల్లా తనపై దాడి చేశారని ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి తెలిపారు.

రెండ్రోజుల క్రితం తొర్రూరులో ట్రాక్టర్ బోల్తా పడి బుక్య శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి కాంట్రాక్టర్ నుంచి ఆర్థిక సాయం అందించాలంటూ ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. అయితే, అక్కడకు చేరుకున్న పోలీసులు ఎంపీటీసీని కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేసన్‌కు తీసుకెళ్లి తనను తీవ్రంగా కొట్టారని ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి ఆరోపిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories