స్పృహలోకి వచ్చిన మధులిక

స్పృహలోకి వచ్చిన మధులిక
x
Highlights

ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడియశోద ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న మధులిక(17) ఆరోగ్యం ఎట్టకేలకు మెరుగుపడింది. గత 2 రోజుల నుంచి వెంటిలేటర్‌పైనే...

ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడియశోద ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న మధులిక(17) ఆరోగ్యం ఎట్టకేలకు మెరుగుపడింది. గత 2 రోజుల నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందు తున్న ఆమె శుక్రవారం రాత్రి స్పృహలోకి వచ్చినట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తుండటంతో పాటు బీపీ, పల్స్‌రేటు సహజస్థితికి చేరుకున్నాయి. ప్రముఖ వైద్యులతో కూడిన బృందం సుమారు 7 గంటలు శ్రమించి ఆమె తల, ఇతర భాగాలకైన గాయాలకు చికిత్స చేశారు.

దాంతో ప్రస్తుతం మధులిక మెల్లగా కోలుకుంటోంది. ఆమెకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని సీఓఓ విజయ్ కుమార్ వెల్లడించారు, మధులిక సైగలు చేస్తోందని.. ఇప్పటికే మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చికిత్సకు స్పందిస్తున్నప్పటికీ..మరో 48 గంటలపాటు మధులిక ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంటుందంటూ వైద్యులు చెప్పారు. ప్రాణాపాయం మాత్రం లేదని కూడా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories