వైరస్‌ నియంత్రణకు ఎల్‌అండ్‌టీ స్మార్ట్‌ టెక్నాలజీ

వైరస్‌ నియంత్రణకు ఎల్‌అండ్‌టీ స్మార్ట్‌ టెక్నాలజీ
x
Highlights

కరోనా వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలు ఎంతో కృషి చేస్తుంది.

కరోనా వైరస్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థలు ఎంతో కృషి చేస్తుంది. వాటితో తోడుగా ఇప్పుడు ప్రముఖ ఎల్ అండ్ టి సంస్థకూడా నిలుస్తుంది. ఈ సంస్థ కోవిడ్ ను తరిమి కొట్టేందుకు తన వంతు కృషి చేస్తూ స్మార్ట్ టెక్నాలజీ సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా లార్సన్‌ అండ్‌ టోబ్రో సీఈఓ అండ్‌ మేనేజింగ్‌ డెరైక్టర్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌ మాట్లాడుతూ దేశంలోని నాగ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ముంబై, పుణె, అహ్మదాబాద్, విశాఖపట్టణం, హైదరాబాద్‌ సహా 20ప్రధాన నగరాల్లో ఎల్‌అండ్‌టీ వరల్డ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన స్మార్ట్‌ టెక్నాలజీ పరిష్కారాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు.

అత్యవసర సమయంలో పౌరసేవల నిర్వహణ కోసం దీన్ని అమలు చేసినట్టు ఈ సంస్థ అదినేతలు తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ సమూహాలుగా ఉన్న పౌరులను నియంత్రించడంలో తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతే కాదు కరోనా వైరస్ కు సంబంధించిన సందేశాలను ప్రాచారం చేయవచ్చునన్నారు. ముఖ్యంగా పోలీసుల, అధికార యంత్రాంగం రెస్క్యూ ప్రయత్నాలను ముమ్మరం చేయడంలో ఇది తోడ్పడుతుందని తెలిపారు. అంతే కాక దేశంలోని 20 ప్రధాన నగరాల్లోని వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పోలీసు ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు ఈ సాంకేతికతల ఆధారంగా రోగులను ట్రాక్‌ చేయవచ్చని స్పష్టం చేసారు.

ప్రస్తుతం క్వారంటైన్‌ అయిన వారిని పర్యవేక్షించడంలోనే ఈ టెక్నాలజి ఉపయోగపడుతుందని ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సిటీ ఆపరేషన్స్‌ సెంటర్లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ఎల్ అండ్ టీ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. దాంతో పాటుగానే తమ కంపెనీ నగరంలోని మున్సిపల్, పోలీస్‌ ఏజెన్సీలతో భాగస్వామ్యం చేసుకుని సాంకేతికతను రూపొందిస్తుందని తెలిపారు. నిఘా, సమూహ నిర్వహణ, సందేశాలను పంపడం, ఆయా నగరాల్లో నివాసముంటున్న ప్రజలకు సమాచారం చేరవేయడం వంటి సేవలను నిర్వహించడంలో తమ వంతు ప్రయత్నం చేస్తుందని అన్నారు.

ఇక ఎల్ అండ్ టీ హైదరాబాద్ నగరంలో అందించే సేవలను చూసుకుంటే ఏఐ ఆధారిత వాహన కదలికల నియంత్రణ చేయనుంది. ఏఐ ఆధారిత క్రౌడ్‌ ను కూడా కంట్రోల్‌ చేయనున్నారు. కరోనాకు సంబంధించి తరచూ చేసే ప్రకటనలతో పాటు పోలీసులు కస్టమైజ్డ్‌ ప్రకటనలను సైతం ఎక్కడైతే ప్రజలు గుంపులుగా ఉంటారో ఈ ప్రాంతంలో స్ధానిక భాష, ప్రాంతం, కంటెంట్‌ ఆధారంగా విడుదల చేస్తున్నారు. అంతే కాక కరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను నగరంలో ఏర్పాటు చేసిన 40 వేరియబల్ మెసేజ్ డిస్ ప్లే బోర్డులపై సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories