వాట్సప్ ద్వారా మరిన్ని ఉపయోగాలు..అవి ఏంటో తెలుసా?

వాట్సప్ ద్వారా మరిన్ని ఉపయోగాలు..అవి ఏంటో తెలుసా?
x
Representational Image
Highlights

వాట్సప్ లో కేవలం మెసేజెస్ చేసుకోవడం, వీడియోలు పంపుకోవడం, సమాచారాన్ని చేరవేసుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

వాట్సప్ లో కేవలం మెసేజెస్ చేసుకోవడం, వీడియోలు పంపుకోవడం, సమాచారాన్ని చేరవేసుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది ఏంటంటారా వాట్సప్ ద్వారా ఇప్పుడు గ్యాస్ ని కూడా బుక్ చేసుకోవచ్చు. అంతే కాదండోయ్ గత ఆరునెలల నుంచి గ్యాస్ సబ్సీడీ మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డిపాజిట్ అయ్యింది, ఎన్ని సార్లు అయ్యింది, ఆరు నెలల్లో ఎన్ని సిలిండర్లు తీసుకున్నారు, ఇంకా ఎన్ని తీసుకవచ్చు అన్న పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం HP గ్యాస్ వినియోగదారులకు మాత్రమే ఇలా అవకాశం కల్పించింది. మరి ఇంకెందుకు ఆలస్యం HP గ్యాస్ సిలిండర్ వినియోగ దారులు వెంటనే కింద చెప్పిన విధంగా ఇంట్లో నుంచే తమ గ్యాస్ ను బుక్ చేసుకోండి.

ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం..

HP గ్యాస్ వినియోగదారులు 9222201122 వాట్సప్ నంబరును మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.

♦ వాట్సప్ లో HELP అని మెసెజ్ టైప్ చేసి ఆ నంబరుకు పంపించండి.

♦ వెంటనే మీ నంబరుకు HP హెల్ప్ లైన్ నుంచి "Please send any of the below keywords to get help. SUBSUDY/QUOTA/LPGID/BOOKగ్యాస్ బుకింగ్ కోసం అని మెసేజ్ వస్తుంది.

♦ వెంటనే మీరు BOOK అని టైప్ చేసి బుకింగ్ నంబరుకు సందేశం పంపించాలి.

♦ తరువాత HP హెల్ప్ లైన్ బుకింగ్ నంబరునుంచి వినియోగదారుల పూర్తి వివరాలు రిప్లై రూపంలో వస్తాయి. ఆ వివరాలు సరైనవే అయితే Y అని టైప్ చేసి మెసేజ్ సెండ్ చెయ్యాలి. అలా పంపింన వెంటనే మీకు గ్యాస్ బుక్ అయినట్టు సమాచారం వస్తుంది. అంతే కాదు ఆ మెసేజ్ లో సిలిండర్ డెలివరీ ఆథెంటికేషన్ కోడ్, రిఫరల్ నంబర్ కూడా వస్తాయి.

ఇక సబ్సిడీ వివరాలు తెలుసుకోవాలనుకునే వినియోగదారులు...

♦ 9222201122 నంబరుకు SUBSIDY అని టైప్ చేసి సందేశం పంపించాలి. వెంటనే వివరాలు మీకు ఈ విధంగా కనిపిస్తాయి.

♦ ఉదాహరణకు.. 1: Refill subsidy sent on:2020-01-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK

కోటా వివరాల తెలుసుకోవాలనుకునే వినియోగదారులు..

♦ 9222201122 నంబరుకు QUOTA అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.

♦ వెంటనే మీకు ఆ నంబరునుంచి ఓ మెసేజ్ వస్తుంది. మీరు తీసుకున్న సిలిండర్ వివరాలు, ఇంకా ఎన్ని సిలిండర్ తీసుకోవచ్చు అన్న పూర్తి వివరాలు మీకు సమాచారం వస్తుంది.

♦ ఇక LPG వినియోగదారులు 17 నంబర్లను www.mylpg.in లో వివరాలు సెండ్ చేసి ఐడీ తీసుకోవచ్చు. లేదా LPGID అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories