శానిటైజర్ లోడ్ తో వెళ్తున్న లారీ దగ్ధం

శానిటైజర్ లోడ్ తో వెళ్తున్న లారీ దగ్ధం
x
Lorry fire accident
Highlights

కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తున్న వేళ దాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నిత్యం శ్రమిస్తున్నాయి.

కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తున్న వేళ దాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నిత్యం శ్రమిస్తున్నాయి. దాన్ని పూర్తిగా పోగొట్టేందుకు అసైన వ్యాక్సిన్ లేకపోయినప్పటికీ..దాని నివారణ చర్యలే ప్రస్తుతం ప్రజలు శ్రీరామ రక్ష అని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేసారు. వాటిలో ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవడం, ముక్కుకి మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు శానిటైజర్లను తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు.

ఈ కోణంలోనే రాత్రి పగలు శానిటైజర్లను అధికమొత్తంలో తయారు చేసి వాటిని లోడు చేసి పంపిస్తున్నారు. కాగా ఆ లారి అనుకోకుండా అగ్నికి ఆహుతి అయిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఓ లారీలో జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వైపు శానిటైజర్ క్యాన్ల లోడుతో వెళుతోంది. కాగా ఆ లారి మియాపూర్ బస్ డిపో వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమయిన లారీ డ్రైవర్, క్లీనర్ లారి నుంచి దిగి పారిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories