మిడతలదండుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

మిడతలదండుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
x
Highlights

ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలో మిడతలు కూడా ప్రవేశిస్తే మరింత నష్టం వాటిల్లనుంది ఉత్తరాదిలో పంటలను నాశనం చేసిన మిడతలు ఇప్పుడు తెలంగాణ వైపు శరవేగంగా వస్తున్నాయి.

ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలో మిడతలు కూడా ప్రవేశిస్తే మరింత నష్టం వాటిల్లనుంది ఉత్తరాదిలో పంటలను నాశనం చేసిన మిడతలు ఇప్పుడు తెలంగాణ వైపు శరవేగంగా వస్తున్నాయి. దీంతో తెలంగాణ మరో ముప్పులో మునగనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని అప్రమత్తమైంది. ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయని స్పష్టం చేసారు.

దీంతో అప్రమత్తమైన తెలంగాణ సీఎం కేసీఆర్ మిడతలదండుపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న మిడతల దండు మన రాష్ట్రం పైన దండెత్తిలే తీసుకెవలసిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి శాస్ర్తవేత్తలు, అధికారులు, నిపుణులు హాజరయ్యారు.

కొద్దిరోజుల వరకు పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతలు కొద్ది కొద్దిగా దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఈ మిడతలు మహారాష్ట్రలోని అమరావతి వరకు బుధవారం నాటికి చేరుకున్నాయి. మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, అవి ఎగురతూ వాటి దారిలో కనిపించే ప్రతీ చెట్టూ చేమను తినేస్తేయని నిపులు చెపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మిడతలను నియంత్రించలేకపోతే రెండు నుంచి మూడు రోజుల్లో మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముందని చెపుతున్నారు.

మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌లలో ప్రజలు ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీలను ముందస్తుగా ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. మిడతలు మహారాష్ట్ర దాటకుండా అమరావతి ప్రాంతంలో నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారన్నారు. ఒక వేల మిడతల దండు నియంత్రణలోకి రాకపోతే అవి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. మిడతల దండు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

అతి వేగంగా వచ్చే ఈ మిడతలు రాజస్థాన్‌లోకి ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్ మీదుగా చేరాయని అక్కడి నుంచి గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలకు విస్తరించాయని అధికారులు తెలిపారు. వాటిని ఆ రాష్ట్రంలో నియంత్రించకపోతే తెలుగు రాష్ట్రాల్లోకి చేరుకుని పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని తెలిపారు. మిడతలను నియంత్రించేందుకు ఖాళీ డబ్బాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులతో పెద్ద శబ్దాలు చేయాలని సూచించారు. ప్రతి 15 లీటర్ల నీటిలో 45 మిల్లీ లీటర్ల వేప నూనెను కలిపి పైరుపై చల్లాలన్నారు.

దేశవ్యాప్తంగా తీవ్ర నష్టం

ఉత్తర భారతదేశంలోని పలు రాష్ర్టాల్లో మిడత ల దండు కలకలం రేపుతున్నది. ఏప్రిల్‌ 11న పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించి, రాజస్థాన్‌లోని సగం జిల్లాలకు విస్తరించి, వేల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహరాష్ట్ర మీదుగా కదులుతున్నాయి. ఈ దండు ను నియంత్రించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇవి 15 నిమిషాల్లో 2.5 ఎకరాల్లోని మి డతలపై క్రిమి సంహార రసాయనాలను పిచికారిచేస్తాయి. 54 వాహనాల్లో 800కుపైగా స్ప్రేయర్లతో క్రిమిసంహారకాలను పిచికారి చేస్తున్నారు.

ఎడారి మిడత జీవిత చక్రం

బరువు 2 గ్రాములు

♦ పొడవు 2-3 అంగుళాలు

♦ ఒకసారి పెట్టే గుడ్లు 80-160

♦ జీవితకాలం 3- 6 నెలలు

♦ ఒక దండులో గరిష్ఠంగా ఉండే సంఖ్య 4- 8 కోట్లు

♦ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చేకాలం 2 వారాలు

♦ పిల్లలు దండులో చేరటానికి పట్టే కాలం 4-6 వారాలు


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories