ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే కీలక మార్గదర్శకాలు

ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే కీలక మార్గదర్శకాలు
x
Highlights

జూన్1 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే పలు సూచనలు చేసింది. ప్రత్యేక రైళ్ళ ద్వారా ప్రయాణం చేయగోరే...

జూన్1 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే పలు సూచనలు చేసింది. ప్రత్యేక రైళ్ళ ద్వారా ప్రయాణం చేయగోరే ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి కనీసం 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్ చేరుకోవాలని తెలిపింది.

రైల్వే మార్గదర్శకాలు

* ప్రయాణికులు సరైన ప్రయాణ టికెట్టు లేకుండా రైలు ఎక్కరాదు

* సరైన ప్రయాణ టికెట్టు లేనివారిని రైల్వే స్టేషన్లలో ప్రవేశించకుండా నివారించడానికి తనిఖీ

* రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్

* అనారోగ్య లక్షణాలు లేని వారినే ప్రయాణానికి అనుమతి

* స్క్రీనింగ్ సమయంలో కోవిడ్ -19 లక్షణాలేవైనా కనబడితే ప్రయాణానికి అనుమతించడం కుదరదు టికెట్టు రుసుము పూర్తిగా రీఫండ్

* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ( రక్త పోటు , మధుమేహం , గుండె సంబంధ సమస్యలు , క్యాన్సర్ మరియు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ). గర్భవతులైన మహిళలు, 10 ఏళ్లు లోపు వయస్సు గల పిల్లలు, 65 ఏళ్లు బడిన వారు అత్యవసర పరిస్థితులలో తప్ప రైలు ప్రయాణం అనుమతి లేదు

* ప్రయాణికులు గమ్య స్థానాల స్టేషన్లలో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్య ప్రోటోకాల్ తప్పనిసరి

* రైల్వే స్టేషన్లలో ప్రవేశ మరియు నిర్గమన ద్వారాల వద్ద ప్రయాణికులు ఉపయోగించుకునేందుకు శానిటైజర్ ఏర్పాటు

* ప్రయాణం పూర్తయ్యే వరకు ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించాలి

* రైళ్ళలో దుప్పట్లు, బెడ్ షీట్ల సరఫరా సౌకర్యం ప్రయాణికుల తమ స్వంత ఏర్పాటు చేసుకోవాలి

* ప్రయాణికులు తమ ఆహారము నీరు వెంట తెచ్చుకుంటే మంచిది. స్టేషన్ల వద్ద ఆహార పదార్థాలు అమ్మే కేంద్రాలు తెరిచి ఉంటాయి.

* ప్రయాణికులందరూ ఆరోగ్య సేతు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రత్యేక రైళ్ళకు అస్ రిజర్వ్ టికెట్లు జారీ చేయడం జరగదు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories