ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రవాణా వ్యవస్థ

ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రవాణా వ్యవస్థ
x
Representational Image
Highlights

లాక్ డౌన్ కారణంగా స్థంబించిపోయిన రవాణా వ్యవస్ధను ప్రభుత్వాలు పునరుద్దరించనున్నారు.

లాక్ డౌన్ కారణంగా స్థంబించిపోయిన రవాణా వ్యవస్ధను ప్రభుత్వాలు పునరుద్దరించనున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 15వ తేది నుంచి దేశీయ విమాన సర్వీసులు, రైల్లు నడవనున్నాయి. ఈ మేరకు కొన్ని విమానయాన సంస్థలు వాటి బుకింగ్ సేవలను ఇప్పటికే ప్రారంభించింది. కొంత మంది ప్రయాణికులు వారి ప్రయాణాల కోసం ఆన్ లైన్ లో టికెట్లను కూడా బుకింగ్ చేసుకోవడం ప్రారంభించినట్టు సమాచారం. ఇక పోతే మార్చి 24 నుంచి నిలిచిపోయిన విమాన సర్వీసులను పునరుద్దరించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విమానయానమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి రెండ్రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఎయిర్ ఇండియా మాత్రం దేశీయ, విదేశీ మార్గాల్లో బుకింగ్ లను ఈ నెల 30 వరకు తీసుకోబోమని శుక్రవారం ప్రకటించింది.

ఈ నెల 14వ తేదీ లాక్‌డౌన్‌ పూర్తయిన తరువాత వెలువడే ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్‌లైన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.ప్యాసింజర్‌ రైలు సేవలు 15 నుంచి కరోనా నేపథ్యంలో గత మార్చి 22 నుంచి ఈనెల 14 వరకు ప్యాసింజరు రైళ్లు రద్దుచేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేవలం గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కాగా దేశంలో అమలుచేసిన లాక్ డౌన్ ఈ నెల 14న ముగియనుండటంతో ప్యాసింజర్ రైల్వే సర్వీసులు ఈ నెల 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

అన్ని మార్గాల్లో అన్ని రైల్లను ఒకే సారి కాకుండా ఎంపికచేసిన కొన్ని ప్రాంతాలకు రైళ్లను ముందుగా నడిపించనున్నామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మిగితా రైల్లను క్రమంగా పునరుద్దరిస్తామని వారు స్పష్టంచేసారు. దగ్గరి ప్రాంతాకలు ప్రయాణించే లోకల్ రైళ్లతో పాటు సబర్బన్‌ రైళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులో తేవాలని అధికారులు నిర్ణయించారు. వాటితో పాటు నగరంలోని మెట్రో, ఎంఎంటీఎస్‌ రైల్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. రిజర్వేషన్‌ బుకింగ్‌లను ఈ నెల 15 నుంచి ఐఆర్‌సీటీసీ స్వీకరించనున్నట్టు సమాచారం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories