జీతాల కోతతో బాధ పెట్టొద్దు కేసీఆర్‌ తాత: వైరల్ ఫోటో

జీతాల కోతతో బాధ పెట్టొద్దు కేసీఆర్‌ తాత: వైరల్ ఫోటో
x
Highlights

కరోనా ఎఫెక్ట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై గట్టిగానే పడిన విషయం తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై గట్టిగానే పడిన విషయం తెలిసిందే. గత నెల తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు నిర్ణయించి విషయం తెలిసిందే. అంతేకాకుండా తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి కుమార్తె ముఖ్యమంత్రిని కోరుతుంది. ఆయన్ను ఉద్దేశించి ఫ్లకార్డు పట్టుకుని అభ్యర్థిస్తోంది. వరంగల్ జిల్లాలోని హన్మకొండ నయీంనగర్‌లో నివాసముంటున్నాడు కూరపాటి సత్యప్రకాష్. ఆయన కమలాపూర్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.

అతనికి ఒక కూతురు కూడా ఉంది. కాగా అతని భార్య సునీత కూడా వృత్తి రిత్యా ఉపాధ్యాయురాలే. కాగా ఆమె అనారోగ్యంతో ఫిబ్రవరి 22వ తేదీన మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆ బాధనుంచి ఆ కుటుంబం కోలు కోకముందే కేసీఆర్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. దీంతో అతని కూతురు లాస్య ఇప్పటికే బాధలో ఉన్న తమపై ఇప్పుడే జీతాల కోతతో మరోసారి బాధ పెట్టొద్దు కేసీఆర్‌ తాత అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో ప్రతి ఒక్కరి మనస్సు కదిలిస్తుంది.

ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ముఖ్య మంత్రి రాష్ర్ట మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు. ఇక ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత ఉంటుందని తెలిపారు. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారన్నారు. ఇక అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత ఉంటుందన్నారు. నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత ఉండగా, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories