కరోనాను కట్టడి చేయటానికి లాక్‌డౌన్‌ నే మంచి మార్గం: సిఎం కెసిఆర్

కరోనాను కట్టడి చేయటానికి లాక్‌డౌన్‌ నే మంచి మార్గం: సిఎం కెసిఆర్
x
KCR (File Photo)
Highlights

తెలంగాణలో నిర్వహిస్తున్న లాక్ డైన్ పై తెలంగాణలో ఉన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో నిర్వహిస్తున్న లాక్ డైన్ పై తెలంగాణలో ఉన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్లే కరోనా వైరస్‌ను అదుపు చేయగలిగామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వైరస్ కాణంగా చనిపోయినవారంతో ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారేనని ఆయన తెలిపారు. కరోనా వైరస్ భారత దేశంలో పుట్టింది కాదని అది విదేశాలలో పుట్టి భారత దేశానికి వ్యాప్తి చెందిందని ఆయన పేర్కోన్నారు. ఈ వైరస్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ చేశారని ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల మన దేశం, రాష్ట్రం అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో కరోనా వచ్చిన వారు సుమారుగా ఢిల్లీ మర్కజ్ వెల్లివచ్చిన వారే అని ఆయన పేర్కొన్నారు. నిజాముద్దీన్‌ లో నిర్వహించిన కార్యక్రమమనే దేశాన్ని కుదిపేసిందన్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ వెల్లివచ్చిన కేసులు మొత్తం 364 నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 కరోనా మరణాలు సంభవించాయని, మరణించిన వారంతా ఢిల్లీ వెల్లి వచ్చిన వారే అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మర్కజ్ వెల్లి వచ్చిన 1089 మందిని గుర్తించామని, మరో 30 మంది ఢిల్లీలోనే ఉన్నారన్నారు. గాంధీలో 308 మంది చికిత్సలో ఉన్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 173 మందికి కరోనా సోకగా. వీరి నుంచి మరో 93 మందికి సోకింది. మర్కజ్‌ వెల్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు పని చేస్తున్నారన్నారు. ప్రజలు అధికారులకు, పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా కేసులను రెండు దశలుగా విభజించామని ఆయన తెలిపారు. మొదటి దశలో వైరస్ మొత్తం 50 మందికి సోకిందని, వారిలో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారన్నారు. మిగతా 20 మంది వారి కుటుంబ సభ్యులేనని ఆయన పేర్కొన్నారు. ఈ 50 మందిలో ఎవరూ చనిపోలేదని, 35 మంది ట్రీట్ మెంట్ తీసుకుని డిశ్చార్జి అయ్యారని సీఎం స్పష్టం చేశారు. మిగతా వారు మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యారని ఆయన అన్నారు. మొదటి దశలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారంటైన్‌ చేసి ప్రభుత్వ పర్యవేక్షణలో పెట్టుకున్నామని సీఎం చెప్పారు. క్వారంటైన్‌లో ఉన్న వారిని కూడా 9వ తేదీ లోపు డిశ్చార్జి అవుతారు.

భారత దేశంలో ఇప్పటి వరకు 4,314 కేసులు నమోదయితే వారిలో 122 మరణించారని ఆయన అన్నారు. ప్రభుత్వం కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటుందని అందుకే చాలా సేఫ్‌గా దేశం ముందుకెళ్తుంది. లాక్‌డౌన్‌ విధించకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వాళ్లం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం మనది. ఐక్యతను ప్రదర్శించి ఇండియా మంచి పని చేసిందని ఇతర దేశాల అధినేతలు ప్రశంసించారు. ఇండియా మంచి పని చేసింది అని ఇంటర్నేషల్‌ జర్నల్స్‌ ప్రకటించాయని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories