నాకు నా బాయ్ ఫ్రెండ్ కావాలి...బంజారాహిల్స్ పీఎస్‌లో యువతి హల్‌చల్

నాకు నా బాయ్ ఫ్రెండ్ కావాలి...బంజారాహిల్స్ పీఎస్‌లో యువతి హల్‌చల్
x
Representational Image
Highlights

ఒక వైపు దేశంలో కరోన కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

ఒక వైపు దేశంలో కరోన కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కాగా ప్రజలు బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లలో చిత్రవిచిత్రమైన కేసులు నమోదవుతున్నాయి. కొంతమంది తమను తమ గ్రామాలకు, ఇండ్లకు పంపమని అభ్యర్దిస్తుంటే, కొంతమంది మందుబాబులు తమకు మద్యం ఇప్పించాలంటు అభ్యర్దిస్తున్నారు. ఇలాంటి కేసులను చూస్తున్న పోలీసులు నవ్వాలో, ఎడవాలో తేలిక సతమతమవుతున్నారు. ఓపిక నశించి చిరాకు తెచ్చుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ యువతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులని విచిత్రమైన కోరిక కోరింది.

పూర్తి వివరాల్లోకివెళ్తే సోమవారం ఉదయం ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. సమస్య ఎంటి అని పోలీసులు ప్రశ్నించగా నాకు నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది, అతన్ని కలిసేందుకు దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటూ వేడుకుంది. ఆ మాట విన్న పోలీసులు ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టారు. సరిగ్గా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి ముందే యువతి ప్రియుడి మీద ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

అంబర్‌పేటలో ఉండే యువకుడు సోమవారం బంజారాహిల్స్ రోడ్ నం.12లో వున్న యువతి ఇంటి దగ్గరికి వచ్చి చాక్కర్లు కొట్టాడు. అది గమనించిన స్థానికులు గుర్తించి యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నాడని, అతనికి తగిన బుధ్ధి చెప్పాలని కోరారు. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు.

అప్పుడు ఆ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని, ఆ యువతి తన వెంట పడుతుందని చెప్పాడు. తనకిష్టం లేదని చెప్పడానికే ఆమె ఇంటికి వెళ్లినట్లు స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు ఇంకోసారి ఆ ఇంటివైపునకు రావొద్దని అతన్ని హెచ్చరించి పంపేశారు. ఈ సీన్ తరువాత పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతి స్టేషన్లో నానా రభస చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌ని కలవాలని ఉందని కోరింది. ఈ సమయంలో అది కుదరదని ఎంత చెప్పినా వినకుండా స్టేషన్ బయట బైఠాయించింది. దీంతో పోలీసులు ఆమెను హెచ్చరించి పంపేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories