గతేడాది మార్చి విద్యుత్‌ బిల్లులనే ఈసారి చెల్లించండి : మంత్రి జగదీష్‌ రెడ్డి

గతేడాది మార్చి విద్యుత్‌ బిల్లులనే ఈసారి చెల్లించండి : మంత్రి జగదీష్‌ రెడ్డి
x
Highlights

లాక్‌డౌన్‌లో ఇబ్బందులు లేకుండా 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తూ విద్యుత్‌ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోందని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి...

లాక్‌డౌన్‌లో ఇబ్బందులు లేకుండా 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తూ విద్యుత్‌ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోందని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడతూ కరెంట్ సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నం. ఎండా కాలంలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. వినియోగదారులపై ఒక్కపైసా కూడా అదనంగా భారం మోపం. ఆపరేటర్ నుంచి సిఎండి వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు.

వినియోగదారులు కరెంట్ బిల్లులు ఆన్ లైన్ లో చెల్లించాలి. లాక్ డౌన్ కారణంగా కరెంట్ రీడింగ్ తీయలేకపోతున్నాం. గతేడాది మార్చి నెల బిల్లులనే ఈ ఏడాది కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనికి ఈఆర్‌సీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. వినియోగదారుల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకొనే అవకాశమే లేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories