లాక్‌డౌన్ ఎఫెక్ట్: దొరకని మందు.. కల్లుకు పెరిగిన డిమాండ్

లాక్‌డౌన్ ఎఫెక్ట్: దొరకని మందు.. కల్లుకు పెరిగిన డిమాండ్
x
Representational Image
Highlights

కరోనా మహమ్మరిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే...

కరోనా మహమ్మరిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే... అయితే నిత్యవసర వస్తువుల తప్ప అన్నింటిని క్లోజ్ చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని బయటకు వచ్చినప్పటికీ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నాయి. దీనితో మందుబాబులకి కష్టాలు మొదలయ్యాయి.. సరైనా సమయానికి మందు దొరకకపోవడం, తెచ్చుకున్న స్టాక్ కూడా అయిపోవడంతో మందుబాబులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే కొందరు మాత్రం బ్లాక్‌లో మద్యం అమ్ముతుండగా పట్టుబట్టారు. అంతేకాకుండా సిలిండర్లలో కూడా మద్యం బాటిళ్లు పెట్టి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు..

ఈ నేపథ్యంలో గ్రామాల్లో దొరికే కల్లుతో మందుబాబులు తృప్తి చెందుతున్నారు. దీనితో కల్లుకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది.. అయితే ఇక్కడ కూడా మందుబాబులు సామాజిక దూరంగా పాటిస్తున్నారు. రెండు, మూడు మీటర్ల దూరంలో సర్కిల్స్ ఏర్పాటు చేసుకొని అందులో నిలబడి కల్లు తాగుతున్నారు. అంతేకాకుండా గీత కార్మికులు కూడా వినూత్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. . ఓ వ్యక్తి పైపు ద్వారా కల్లు పోస్తూ కనిపిస్తున్నా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కల్లు కూడా దొరకక కొన్ని చోట్లల్లో మద్యం ప్రియులు విలవిల్లాడుతున్నారట.. కేరళ, హైదరాబాద్ లలో మద్యం దొరకక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి..

ఇక కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా బాధితులు సంఖ్య అయిదు ల‌క్ష‌లకి దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వైరస్ బారిన ప‌డి 22,334 మంది మృతిచెందారు. 1,21,214 మంది కోలుకున్నారు. ఇక భారత్ లో కుడా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 870 కి చేరుకోగా, 20మంది మృతి చెందారు. తాజాగా కేరళలో మొదటి మరణం సంభవించింది. మార్చి 22న కరోనా వైరస్ లక్షణాలతో కలంసెరీ హాస్పిటల్‌లో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడు దుబాయ్ పర్యటనకు వెళ్లొచ్చినట్టుగా తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories