చుక్క లేక ఉక్కిరి బిక్కిరి అవుతోన్న మందు బాబులు

చుక్క లేక ఉక్కిరి బిక్కిరి అవుతోన్న మందు బాబులు
x
Highlights

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను విధించింది. అందులో భాగంగా కల్లు దుకాణాలు, వైన్స్, బార్‌లు మూసివేయడంతో మందు బాబులకు...

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను విధించింది. అందులో భాగంగా కల్లు దుకాణాలు, వైన్స్, బార్‌లు మూసివేయడంతో మందు బాబులకు కష్టాలు మొదలు అయ్యాయి. కల్లు ప్రియులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కల్లు, మద్యం లేక పల్లె, పట్టణాలు విలవిల్లాడుతున్నాయి. కల్లుకు అలవాటు పడిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మద్యం ప్రియులు వింతగా ప్రవర్తిస్తున్నారు. దాంతో హాస్పిటల్స్ కు భారీగా వచ్చి చేరుతున్నారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం, కల్లు దుకాణాలు మూసివేశారు. దాంతో మద్యం ప్రియుళ్లకు కష్టాలు వచ్చి పడ్డాయి. కల్లు ప్రియుళ్లపై కరోనా ఎఫెక్ట్ పడింది. కల్లుదొరక్క వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్లు, మద్యం దొరక్క పల్లె, పట్టణాలు విలవిల్లాడుతున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మద్యం ప్రియుళ్ల వింత ప్రవర్తనతో ఎర్రగడ్డ హాస్పిటల్ భారీగా ఓపీ పెషెంట్ల సంఖ్య పెరిగింది.

లాక్ డౌన్ దగ్గర నుంచి కల్లు లేక రోజుకు రెండు, మూడు మంది వింతగా ప్రవర్తించే కేసులు నమోదు అయ్యేవి. అయితే రెండు రోజుల నుంచి కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్ కు ఒక్క రోజే వందమంది ఓపీ కేసులు వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కల్లులో క్లోరోఫామ్, డైజోఫాం లాంటి రసాయనాలు కలపడం వల్ల అది ఒక్కసారి తాగితే అలవాటు గా మారుతుంది. దాంతో లాక్ డౌన్ కారణంగా ఆరు రోజులుగా కల్లు లేకపోయేసరికి వాళ్ల శరీరంలో మార్పులు వచ్చాయి. దాంతో ఫిట్స్ తో చనిపోతున్నారు. కల్లు లేక విలవిల్లాడిపోతున్నారు. కల్లులేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వింతగా ప్రవర్తిస్తున్నారు. అటు మద్యం బాబులు చుక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మద్యం లేక ఫిట్స్ వచ్చి చనిపోతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories