Corona Effect: వాట్సప్ లో ఎడ్ల బేరం..

Corona Effect: వాట్సప్ లో ఎడ్ల బేరం..
x
Representational Image
Highlights

సహజంగా పశువులను అమ్మాలన్నా, కొనాలన్నా పశువుల సంతుకు వెలతారు. అక్కడ వారికి నచ్చిన పశులను ఎంచుకుని బేరమాడతారు.

సహజంగా పశువులను అమ్మాలన్నా, కొనాలన్నా పశువుల సంతుకు వెలతారు. అక్కడ వారికి నచ్చిన పశులను ఎంచుకుని బేరమాడతారు. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా పశువుల సంతలు అన్నీ మూత పడ్డాయి. దీంతో పశువులకు కొనుగోలు చేసి ఈ ఏడాది నాగలి పట్టి పంటను పండించుందాం అనుకున్న రైతులు, పశుగ్రాసం దొరకకుండా, వాటిని మేపలేక అమ్మేద్దాం అనుకునే రైతులకు నిరాశే మిగులుతుంది.

కానీ ఓ రైతు మాత్రం తన జోడెడ్లను అమ్మడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు. ఈ మధ్య కాలంలో పట్టణాల్లో ఏ వస్తువు కావాలనుకున్నా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుంటాం. ఆ ఆలోచన తట్టిన రైతు తన ఎడ్లను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజపురానికి చెందిన చిలుకూరి వెంకన్న తన వద్ద ఉన్న ఎడ్లను అమ్మాలనుకున్నాడు. అతను కొన్ని ఏండ్లుగా పశువులను అమ్మడం, కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే నేపథ్యంలో తాను ఈ మధ్య కాలంలోనే కొన్న రెండు జతల కాడెడ్లను అమ్మేద్దాం అనుకున్నాడు. కానీ లాక్ డౌన్ సందర్భంగా ప్రస్తుతం సంతలు

నడవకపోవడంతో అతని ఎడ్లను ఫొటో తీసి వాట్సప్‌లో ఈ ఎడ్లు అమ్మబడును అన పోస్ట్‌ చేశాడు. ఎవరికైనా ఎడ్లు కావాలనుకుంటే సంప్రదించాలని కూడా తెలిపాడు. ప్రతి రోజు ఎడ్లకు దాణా, గడ్డి పెట్టలేని పిరిస్థితిలో ఉండడం వల్లనే ఎలాగైనా వాటిని అమ్మాలని వాట్సాప్‌లో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.కరోనా వైరస్...ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రజలందరినీ వణికిస్తుంది.

చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలంతా ఇండ్లకే పరిమితం అవుతున్నారు. బస్సులు, రైల్లు, షాపులు, సంతలు అన్నీ లాక్ డౌన్ లో భాగంగా బంద్ పాటిస్తున్నాయి. దీంతో మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రమే కాదు, గ్రామాలు మొదలుకుని ప్రపంచ దేశాల మధ్య కూడా సంబంధాలు తెగిపోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories