గ్యాస్ వినియోగ దారులకు షాక్...14 రోజుల తరువాతే బుకింగ్

గ్యాస్ వినియోగ దారులకు షాక్...14 రోజుల తరువాతే బుకింగ్
x
LPG Gas Cylinder
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ లౌన్‌ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ లౌన్‌ ప్రకటించింది. దీంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. బయటికి వెలితే ఎక్కడ కరోనా వైరస్ తమకు వ్యాపిస్తుందో అన్న ముందు చూపులో రెండు, మూడు నెలలకు కావలసిన సరుకులను ఒకే సారి తెచ్చుకుని ఇండ్లలో స్టాక్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్లను కూడా ఒకే సారి రెండు చొప్పున బుకింగ్ చేసి తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ల సంఖ్య ఒక్క సారిగా విపరీతంగా పెరిగిపోయాయి.

ప్రభుత్వాలు లాక్ డౌన్ ను మరిన్ని రోజులు ఉంచుతారనే వార్తలు విన్న ప్రజలు మరింత ఆందోళనకు గురై బుక్ చేసిన గ్యాస్ ఖాళీ అయిపోక ముందే సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ బుకింగ్ సంఖ్య ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో విపరీతంగా పెరిగిపోతుంది. మరిన్ని రోజులు లాక్ డౌన్ లో ఉంటే తమకు ఎక్కడ గ్యాస్ సిలిండర్లు ఇండవో అన్న భయంతోనే ప్రజలు ఈ విధంగా బుకింగ్ లను చేసుకుంటున్నారు. ఐతే పేదవాళ్లు మాత్రం ఇలాంటివి చేసుకోలేకపోతున్నారు.

సాధారణ రోజుల్లో గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రోజుకు లక్ష నుంచి రెండులక్షల వరకు ఉంటాయి. కానీ తెలంగాణలో ఎప్పుడైతే లాక్ డౌన్ మొదలైందో అప్పటి నుంచి ప్రజలు రెండు, మూడు సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో బుకింగ్స్ సంఖ్య అమాంతం మూడున్నర లక్షలకు పెరిగిపోయింది. దీంతో గ్యాస్ కంపెనీకు ఒక్క సారిగా షాక్ తగిలినట్టయింది. గ్యాస్ సిలిండర్ నమోదు ప్రక్రియలో మార్పులు చేశాయి. గ్యాస్ బుకింగ్ పై ఆంక్షలు విధించాయి. డబుల్ బుకింగ్ సేవలకు రద్దు చేసింది.

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం సిలిండర్ వచ్చిన 24 గంటల తర్వాత మరో సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఒటకే సిలిండర్ కావాలనుకున్న వారు సిలిండర్ బుక్ చేసిన 14రోజుల తర్వాత మాత్రమే మరో దానికి బుక్ చేసుకోవచ్చు. కానీ సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో వనియోగదారులు ఒకటే సారి మూడు సిలిండర్లు తీసుకోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని భారత్, హెచ్పీ గ్యాస్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిబంధనలను శుక్రవారం నుంచే అమలు చేశాయి. ఇండేన్ గ్యాస్ కంపెనీ శనివారం నుంచి ఈ నిబంధనలను పాటించనుంది.

ఇక మరో వైపు పేద ప్రజల కోసం కేంద్రం ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారికి ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. ఇప్పుడు వాళ్లు కూడా సిలిండర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ స్కీమ్ కింద బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు వచ్చే మూడు నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని వారు ప్రకటించారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల అందరికీ పద్ధతిగా గ్యాస్ బండలు అందుతాయని కంపెనీలు అంటున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories