పోలీస్ పెట్రోలింగ్ కారుపై చీరలు, దుప్పట్లు

పోలీస్ పెట్రోలింగ్ కారుపై చీరలు, దుప్పట్లు
x
Highlights

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడులో శివరాత్రి సందర్భంగా ఎంతో మంది భక్తులు అక్కడికి తరలి వచ్చారు.

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడులో శివరాత్రి సందర్భంగా ఎంతో మంది భక్తులు అక్కడికి తరలి వచ్చారు. జాగారాలు చేసే భక్తులు అక్కడే ఉన్న సత్రాలలో గదులను తీసుకుని ఉంటున్నాయి. అయితే వేములవాడలో భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగిపోవడంతో పోలీసులు భారీగానే బందోబస్తును ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలోనే ఓ పోలీస్ కారును ఒక సత్రం ముందు ఆపారు.

దాంతో ఆ సత్రంలో ఉన్నవారు ఆ కారు బానెట్ మీద దుప్పట్లు, చీరలు ఆరేసారు. పాపం ఆ సత్రంలో ఉన్న వారికి బట్టలు ఆరేయడానికి తాడు దొరకనట్టుంది. ఎలాగూ తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం నడుస్తుంది కదా, పోలీసులను కాక వారి వాహనాన్ని కూడా ఈ విధంగా వాడుకుందాం అనుకున్నట్టున్నారు. ఇక ఈ దృష్యాన్ని చూని వారు కూడా 'ఇదే ఫ్రెండ్లీ పోలీసింగ్.' అని సెటైర్లు వేస్తున్నారు.

ఇక పోతే మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలో అంగరంగవైభవంగా స్వామి వారికి పూజను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంటాణ నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలనుంచి కూడా ఎంతో మంది భక్తులు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో దేవాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడి నెలకొంది. ఇకపోతే దర్శనానికి వచ్చిన బక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. వైద్య సదుపాయాలు, అన్నపానీయాలు అన్నింటినీ భక్తులకు అందిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories