తెలంగాణాలో కరోనా పరీక్షలు చేసే ప్రభుత్వం ల్యాబ్స్ ఇవే..

తెలంగాణాలో కరోనా పరీక్షలు చేసే ప్రభుత్వం ల్యాబ్స్ ఇవే..
x
Highlights

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నివారణ...

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రానున్న పది రోజుల్లో హైదరాబాద్ నగరంతోపాటు దాని చుట్టు పక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే కాకుండా ఇక నుంచి ప్రయివేటు ల్యాబ్‌లు, ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. దీనికి అవసరమైన అన్ని మార్గదర్శకాలు చికిత్సకు, పరీక్షలకు అయ్యే ధరలను కూడా నిర్ణయించారు.

అంతే కాకుండా ఇప్పటి కరోనా టెస్టులు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పది ప్రభుత్వ ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి మొదలయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వ ల్యాబ్ లలోనే కరోనా బాధితులకు టెస్టులను నిర్వహించారు. ఇక ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రయివేటు ల్యాబ్ లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ప్రభుత్వ ల్యాబ్స్ ...

గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్

ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్

సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్ & కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్

నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్

ESIC మెడికల్ కాలేజ్, హైదరాబాద్

కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్

సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్

సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్

అందుబాటులోకి వచ్చిన ప్రయివేటు ల్యాబులు...

జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్

హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్

చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్

అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ బోయినపల్లి

పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్

మేడ్చల్ లోని పాత్‌ కేర్ ల్యాబ్‌లు..

లింగంపల్లిలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్

న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్ పాత్లాబ్స్...

సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం..

మేడ్చల్, మల్కాజ్గిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్..

బంజారా హిల్స్‌లో టెనెట్ డయాగ్నోస్టిక్స్

మాధాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్..

బంజారా హిల్స్‌లోని విరించి హాస్పిటల్

సికింద్రాబాద్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

లెప్రా సొసైటీ-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి

సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్

బంజారా హిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌ లో ల్యాబ్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories