తెలంగాణలో వైన్ షాపుల ముందు బారులు తీరిన మందుబాబులు..

తెలంగాణలో వైన్ షాపుల ముందు బారులు తీరిన మందుబాబులు..
x
Highlights

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ల లో పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులను మూసివేస్తారని, ఎన్నికలు జరిగిన తరువాతే షాపులను తెరుస్తారని ప్రచారం కొనసాగుతుంది.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ల లో పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులను మూసివేస్తారని, ఎన్నికలు జరిగిన తరువాతే షాపులను తెరుస్తారని ప్రచారం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 29 వరకు లిక్కర్ అమ్మకాలను నిలిపివేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పొటీపడే అభ్యర్థులు ఎన్నికల ముందు మద్యం, డబ్బు పంపిణీ చేస్తారని, దాన్ని కట్టడి చేసేందుకు వైన్ దుకాణాలు మూసి ఉంచుతారని ప్రచారం జరుగుతోంది.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ ప్రచారంతో వైన్ షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. కేవలం ఆంద్రప్రదేశ్ షాపులు మాత్రమే కాకుండా తెలంగాణ సరిహద్దులో ఉన్న వైన్ షాపుల్లో కూడా మందుబాబులు బారులు తీరుతున్నారు. దీంతో మద్యం వ్యాపారులంతా ఫుల్ ఖుశీగా ఉన్నారు. తమకు ఈ సారి అనుకున్నదాని కంటే లాభాలు వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే ఏపీ సరిహద్దులో ఉన్న మద్యం దుకాణాలకు ఇక్కడి వ్యాపారులు సరకును మరింతగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు పెరిగి, రాష్ట్రంలో ఎక్సైజ్‌‌‌‌ ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ సరిహద్దులోని ఎనిమింది కొత్త జిల్లాల్లో ఉన్న 538 లిక్కర్ షాపులకు ఎక్సైజ్ అధికారులు ఈ నెలలో రెట్టింపు లిక్కర్ ను సప్లై చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కాగా ప్రతి నెలలో ఈ జిల్లాల్లో సుమారుగా రూ.500 కోట్ల మద్యం అమ్మకాలు నమోదవుతుంటాయని అంచనా. ఇక ఈ ఎన్నికల పుణ్యమాని ఈ నెలలో ఆదాయం సుమారుగా రూ.వెయ్యి కోట్లు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మద్యం ధరలు కూడా ఆంధ్రప్రదేశ్ తో పొలిస్తే తెలంగాణలో చాలా చవక అని అక్కడకి, ఇక్కడికి రూ.100 తేడా ఉంటుందని అదికారులు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories