హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో చిరుత...కొనసాగుతున్న గాలింపు చర్యలు

హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో చిరుత...కొనసాగుతున్న గాలింపు చర్యలు
x
Leopard in Hyderabad road (file photo)
Highlights

మూడు రోజుల క్రితం కాటేదాన్ లో అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై చిరుత పులి కలకలం సృష్టించి అక్కడి నుంచి తప్పించుకు పారిపోయిన విషయం తెలిసిందే.

మూడు రోజుల క్రితం కాటేదాన్ లో అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద రోడ్డుపై చిరుత పులి కలకలం సృష్టించి అక్కడి నుంచి తప్పించుకు పారిపోయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆ పులి కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ వద్ద కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హిమాయత్‌ సాగర్‌లో చిరుతపులి నీళ్లు తాగుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిరుత కోసం హిమాయత్‌సాగర్‌ వద్ద పోలీసులు, అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. మొదట స్థానికులు అది కుక్క అనుకుని భ్రమపడినప్పటికీ కాసేపు అలా చూడగా దాని ఒంటిపై మచ్చలు చూసి అమ్మో అది చిరుతపులే అని గమనించి ఎవరికి వాళ్లు ఇళ్లలోకి పారిపోయి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని పులి ఆనవాళ్లను గుర్తిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయాల కారణంగా చిరుత ఎటూ కదలలేని పరిస్థితి. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డు మీద చిరుత ఉందన్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులు అది ఉన్న ప్రాంతానికి వచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తు మందు ఇచ్చేలోపే చిరుత అక్కడి నుంచి పారిపోయింది. దీంతో చిరుతను ఎలాగైనా పట్టుకొని తీరుతామని అధికారులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories