నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు
x
Highlights

ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని రోజులుగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇక మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. ఇదిలావుంటే ఇప్పటికే ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories