ఆరోవిడత హరితహారం పెద్ద ఎత్తున చేపడుతున్నాం : మంత్రి కేటీఆర్

ఆరోవిడత హరితహారం పెద్ద ఎత్తున చేపడుతున్నాం : మంత్రి కేటీఆర్
x
Highlights

మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ శంషాబాద్‌లోని హెచ్‌ఎండీఏ నర్సరీ మొక్కలను బుధవారం పరీశీలించారు.

మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కాబోతున్ననేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ శంషాబాద్‌లోని హెచ్‌ఎండీఏ నర్సరీ మొక్కలను బుధవారం పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీ అధికారులతో ముచ్చటించారు. నర్సరీలో మొక్కలను పెంచుతున్న తీరు, ఏ రకం మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది హరిత హారం కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున చేపడుతున్నట్లుగా మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలో ఉన్న వారిక ఎవరికైనా మొక్కలు కావాల్సి వస్తే వారు నగర పరిధిలో ఉన్న ప్రభుత్వ నర్సరీలలో నుంచి ఉచితంగా తీసుకోవచ్చనని స్పష్టం చేశారు.

ఇప్పటికే అన్ని పట్టణాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సర్సరీల్లో పనిచేసే అర్హులందరికీ ఈపీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. మరో రెండ్రోజుల్లో నగరంలోని నర్సరీల సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతామని మంత్రి చెప్పారు. హరితహారంలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని భవిష్యత్తు తరాలకి ఆకుపచ్చ తెలంగాణను కానుకగా ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఈ మొక్కలను ప్రజలకు అందించే ప్రక్రియ వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories