Top
logo

నరసింహన్ పై కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్..

నరసింహన్ పై కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్..
Highlights

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నరసింహన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ తన ట్వీట్టర్‌లో నరసింహన్‌కు వీడ్కోలు సందేశం ఇచ్చారు. ఎన్నోసార్లు అనేక అంశాలపై మీతో సంభాషించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గత పదేళ్లుగా రాష్ట్రానికి పెద్ద దిక్కులా నిలబడి మార్గదర్శనం చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సర్. మీకు భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాం" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటు హిమాచ‌ల్ ప్రదేశ్ గ‌వ‌ర్నర్‌గా నియ‌మితులైన బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్రమంత్రి బండారు ద‌త్తాత్రేయ‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


Next Story

లైవ్ టీవి


Share it