కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్...

కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్...
x
KTR
Highlights

ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపారు. గతంలో కరోనా పాజిటివ్ వచ్చి గాంధీలో చికిత్స తీసుకుంటున్న 11 మందికి ఈ రోజు చేసిన పరీక్షలో నెగిటివ్ చ్చిందని తెలిపారు.

ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపారు. గతంలో కరోనా పాజిటివ్ వచ్చి గాంధీలో చికిత్స తీసుకుంటున్న 11 మందికి ఈ రోజు చేసిన పరీక్షలో నెగిటివ్ చ్చిందని తెలిపారు.ఇప్పటి వరకు వారందరూ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారందరికీ నయం అయిందని, ఎంతో సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేసారు. అయితే ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ లో చికిత్స పొందుతున్న 11 బాధితులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని ట్వీట్ చేసారు.

వీరందరినీ మరో రెండు రోజులు పరీక్షించి వారిని డిశ్చార్జి చేయనున్నారుని స్పష్టం చేసారు.అంతకు ముందు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల గ్రాఫ్‌ గురించి ట్విటర్లో ఆయన చర్చించారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటి వరకు 67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారిలో ఒక వృద్దుడు చనిపోయారని తెలిపారు.

ఇక పోతే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిర్వహిస్తుండడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 145 మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేసామని ఆయన వెల్లడించారు. దీంతో ప్రజలు బయటికి వెల్లకుండా వారి ఇంటి వద్దకే కూరగాయలు వస్తాయన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories