Top
logo

పాక్ నెటిజన్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

పాక్ నెటిజన్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Highlights

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ మరణం పట్ల దారుణ వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్థానీ నెటిజెన్ కు టీఆర్ఎస్...

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ మరణం పట్ల దారుణ వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్థానీ నెటిజెన్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళ్తే, సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి ఫొటోలను అప్ లోడ్ చేశారు. ఈ పోస్టుకు స్పందించిన ఓ పాకిస్థానీ నెటిజెన్.. దారుణ వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఆమె చనిపోయారని.. ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని ట్వీట్ చేశాడు.

ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని మండిపడ్డారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే... మీరు పాకిస్థాన్‌కు చెందినవారిలా ఉన్నారని అన్నారు. మీరు ఎవరైనా సరే.. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోగలని ట్వీట్ చేశారు.

Next Story