దక్షిణాది అంటే కేంద్రానికి చిన్న చూపా : కేటీఆర్

దక్షిణాది అంటే కేంద్రానికి చిన్న చూపా : కేటీఆర్
x
Highlights

కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత దోరణ అవలంభిస్తోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. పని చేస్తున్నరాష్ట్రాలకు ప్రోత్సహాకాలు ఇవ్వడంలేదుని...

కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత దోరణ అవలంభిస్తోందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. పని చేస్తున్నరాష్ట్రాలకు ప్రోత్సహాకాలు ఇవ్వడంలేదుని ఆరోపించారు. ప్రారిశ్రామిక కారిడార్స్ ఢిల్లీ, ముంబాయ్ లకు తరలిపోతున్నాయన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల మధ్య ఎందుకు ఇండస్ట్రీయల్ కారిడార్ ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ అన్నా అదే పరిస్థితని ఢిల్లీ, ముంబాయ్ ల్లోనే ఏర్పాటు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

టీఎస్ ఐపాస్‌తో తెలంగాణలో పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చామన్నారు మంత్రి కేటీఆర్. టీఎస్ ఐపాస్ వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్లలో 11,609 పరిశ్రమల ఏర్పాటు చేశామని ఇంకా ప్రారంభానికి సిద్ధంగా 769 పరిశ్రమలు ఉన్నాయన్నారు. 13 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఫార్మా రంగంలో ప్రపంచానికి కేంద్రంగా తెలంగాణ ఉందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories