Top
logo

ప్రజలే మన బాసుల: కేటీఆర్

ప్రజలే మన బాసుల: కేటీఆర్
Highlights

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. పదవులు వచ్చింది పార్టీ వల్లేనని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. పదవులు వచ్చింది పార్టీ వల్లేనని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. అసలు ప్రజలే మన బాసులనే విషయాన్ని నేతలు గుర్తించుకోవాలన్నారు. అసలు పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కదాని స్పష్టం చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్లు.. ఆ పదవి పార్టీ వల్లే వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం అనుభవిస్తున్న పదవి పార్టీ వల్లే వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతున్నారు' అని సమావేశంలో కేటీఆర్ అన్నట్లు సమాచారం. తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి ఓనర్లం తామేనని చెబుతూ తనకు వచ్చిన పదవి ఎవరి భిక్షా కాదన్నారు. కులం పేరుతో తాను మంత్రి పదవి సాధించలేదని, ప్రజల అండతోనే నెగ్గి మంత్రినయ్యానని ఈటల అన్న విషయం తెలిసిందే.. ఇక ఈ నేపథ్యంలో కేటీఆర్ కలకలం రేపుతున్నాయి. ఈటల మాటలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top