శంషాబాద్ ను మరింత అభివృద్ది చేస్తాం: కేటీఆర్

శంషాబాద్ ను మరింత అభివృద్ది చేస్తాం: కేటీఆర్
x
Highlights

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పరుగులు తీస్తున్న మెట్రో సర్వీస్‌ను అంతర్జాతీయ విమాశ్రయం వరకు పొడిగించనున్నారని గతంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పరుగులు తీస్తున్న మెట్రో సర్వీస్‌ను అంతర్జాతీయ విమాశ్రయం వరకు పొడిగించనున్నారని గతంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. విమానాశ్రయంతో అంతర్జాతీయంగా పేరుగాంచిన శంషాబాద్‌ను అభివృద్ధిలోనూ అదే స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. కాగా ఆ ప్రకటన చేసి ఇప్పటికే యేండ్లు గడుస్తున్నాదాని ఊసుకూడా లేదు.

కాగా ఆదివారం కొంత మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెట్రో రైలు ప్రస్ధావన తీసుకొచ్చారు. ఖచ్చితంగా ప్రయాణికుల సౌకర్యార్ధం శంషాబాద్‌ వరకు పొడిగిస్తామని తెలిపారు. అంతే కాకండా శంషాబాద్‌ లో పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

అనంతరం పార్టీలో చేరిన నాయకుల గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వం ఎంతో బాగుందని, వారి నాయకత్వం మీద నమ్మకంతోనే పలువురు నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గణేష్‌గుప్తా లాంటి నాయకులు పార్టీలో చేరి తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ప్రతి పక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు టీఆర్ఎస్ పార్టీమీద బురద చల్లాలని చూస్తున్నారన్నారు. అందుకే ఆ పార్టీల పరిస్థితి అధ్వానంగా తయారైందని, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిందన్నారు. అయినా ఆపార్టీల తీరు మారడం లేదన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు జహంగీర్‌ఖాన్, అజయ్, కుమార్, భద్రు, రేఖ, విజయలక్ష్మి, నజియా, సునీత, వ్యాపారవేత్త వేణుమాధవ్‌రెడ్డి ఉన్నారని తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories