సీఎం అవుతారనే వార్తలపై స్పందించిన కేటీఆర్

సీఎం అవుతారనే వార్తలపై స్పందించిన కేటీఆర్
x
సీఎం అవుతారనే వార్తలపై స్పందించిన కేటీఆర్
Highlights

కాంగ్రెస్‌ పాలనలో చెత్త మున్సిపాలిటీలు టీఆర్ఎస్‌ హయాంలో కొత్త మున్సిపాలిటీలు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో గత ప్రభుత్వాలు...

కాంగ్రెస్‌ పాలనలో చెత్త మున్సిపాలిటీలు టీఆర్ఎస్‌ హయాంలో కొత్త మున్సిపాలిటీలు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్‌. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పబోతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్‌ విసిరారు.

దేశం మొత్తంలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ఎలా ఉందో చూపెట్టగలదా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాదిలోగా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను సీఎం అవుతానంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. మీడియాలోనే ఈ ప్రచారం జరుగుతోందని మంత్రులతోనూ మీడియా వాళ్లే మాట్లాడిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం కావాలన్న ఆశ తనకు లేదన్నారు కేటీఆర్. టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి పనులు తమను గెలిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్‌‌.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories