ఖైదీ నంబర్‌ 3077 : కేటీఆర్‌

ఖైదీ నంబర్‌ 3077 : కేటీఆర్‌
x
KTR(File photo)
Highlights

ప్రతి ఏడాది టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించుకునే విషయం తెలిసిందే.

ప్రతి ఏడాది టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించుకునే విషయం తెలిసిందే.కానీ ఈ ఏడాది మాత్రం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా టీఆర్ఎస్ శ్రేణులు 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం చేసిన ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన వరంగల్ జైలులో గడిపిన రోజులను నెమరు వేసుకున్నారు. అందుకు సంబంధించిన ఓ 'ఖైదీ గుర్తింపు కార్డు'ను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

అంతే కాదు "తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటున్న వేళ, నా మిత్రుడొకరు దీన్ని పంపించారు. దీక్షా దివస్ రోజున... అంటే, నవంబర్ 29, 2009న కేసీఆర్ గారిని, జయశంకర్ సార్ ను అరెస్ట్ చేసారు. నన్ను కూడా అరెస్ట్ చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆనాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి"అని కేటీఆర్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఇక ఆయన ట్వీట్ చేసిన గుర్తింపు కార్డులో ఉన్న వివరాలను చూసుకుంటే 2009 నవంబర్‌ 29న హన్మకొండ పోలీసులు ఆయనను అరెస్ట చేసారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో కేటీఆర్‌కు 3077 నంబరును కేటాయించారు. 447/2009 కేసులో కేసులో వరంగల్‌ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రిమాండు విధించారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories