చిన్ననాటి ఐస్‌ గోలా తాతకు కేటీఆర్‌ చేయూత..

చిన్ననాటి ఐస్‌ గోలా తాతకు కేటీఆర్‌ చేయూత..
x
Highlights

చిన్ననాటి విషయాలను గుర్తుంచుకోవడమే గొప్ప విషయమైతే… అప్పటి వారిని గుర్తించి… వారిని కలిసి అవసరమైన సహాయం అందించడం మరింత గొప్ప విషయం. అలాంటి పనే చేశారు...

చిన్ననాటి విషయాలను గుర్తుంచుకోవడమే గొప్ప విషయమైతే… అప్పటి వారిని గుర్తించి… వారిని కలిసి అవసరమైన సహాయం అందించడం మరింత గొప్ప విషయం. అలాంటి పనే చేశారు మాజీ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ముప్పై ఏళ్ల క్రితం అబిడ్స్‌‌లోని గ్రామర్ స్కూల్లో కేటీఆర్ చదువుకున్నారు. అప్పట్లో ఆ స్కూలు ముందు ఓ వ్యక్తి ఐస్ గోలా అమ్ముతూ ఉండేవాడు. అతని పేరు సయ్యద్‌ అలీ. సోషల్‌ మీడియా పుణ్యమా అని ముప్పైఏళ్ళ తర్వాత కేటీఆర్‌ ఆ ఐస్‌ గోలా తాతను కలుసుకున్నారు. అయితే అంతకుముందు మహబూబ్‌ అలీ అనే యువకుడు కేటీఆర్ కు 'కేటీఆర్ సార్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్ గోలా అమ్మిన సయ్యద్ అలీ అనే వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు'అని ట్వీట్ చేశాడు.

వెంటనే స్పందించిన కేటీఆర్.. తప్పకుండా కలుస్తాను తన వద్దకు రమ్మని రీట్వీట్ చేశారు. దాంతో ఆ పెద్దాయన గురువారం కేటీఆర్‌ ను కలుసుకున్నారు.. ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగారు కేటీఆర్. ఈ క్రమంలో సయ్యద్ అలీ తన బాధను వెళ్లబోసుకున్నాడు.. దాంతో ఆయన మాటలకు చలించిన కేటీఆర్.. ఆయనకు ఇల్లు, పెన్షన్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన కుమారులకు కూడా ఉపాధి కల్పిస్తానని భరోసా ఇచ్చారు. KTR ఆత్మీయతకు సయ్యద్‌ ఎంతో పరవశించిపోయాడు. కేటీఆర్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories