ప్లాస్టిక్ ను వాడితే ఫైన్లు విధిస్తాం: మంత్రి కేటీఆర్

ప్లాస్టిక్ ను వాడితే ఫైన్లు విధిస్తాం: మంత్రి కేటీఆర్
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వాలు ఏ విధంగా పట్టణాలను అభివృద్ది చేసాయో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నగరాలను అభివృద్ది చేస్తున్నాయో ప్రజలు గమనించాలని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వాలు ఏ విధంగా పట్టణాలను అభివృద్ది చేసాయో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నగరాలను అభివృద్ది చేస్తున్నాయో ప్రజలు గమనించాలని కేటీఆర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పట్టణాలకు ఆదర్శంగా ఖమ్మం పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఖమ్మంలో మంచి కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు.

సంక్షేమ పథకాల వల్ల పేదలంతా సంతోషంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఖమ్మం పట్టణం రూపురేఖలు మారేలా అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వస్తువాలను ఎవరూ వాడకూడదని, చికెన్ షాపులకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా స్టీలు బాక్సులు తీసుకొని వెళ్లాలని సలహా ఇచ్చారు. ఎవరైతే ప్లాస్టిక్ ను వాడుతున్నారో ఆ దుకాణదారులకు మేం ఫైన్లు విధిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లకారం మినీ ట్యాంక్ బండ్‌ను ప్రారంభించారు. దాంతో పాటుగానే మినీ ట్యాంక్‌బండ్‌పై స్కై సైక్లింగ్, ఒపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్లి నగరంలోని పెవిలియన్‌ మైదానంలో బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియం, శాంతి నగర్‌లో కొత్తగా రూ. 2.6 కోట్లతో నిర్మించిన కళాశాల భవనాలను, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాల వ్యవస్థను మంత్రి ప్రారంభించారు.

ఆ తరువాత ఏఎస్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర అధికారులు అదే ప్రాంతంలో మొక్కలను నాటారు. దీంతో పాటుగానే తర్వాత అనంతరం విద్యార్థులతో కేటీఆర్‌ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇంఛార్జ్‌ కలెక్టర్‌ ఎంవీరెడ్డి, సీపీ తప్సీర్‌ ఇక్బాల్‌ పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories