Top
logo

అమరుల త్యాగాలను స్మరించుకుందాం : మంత్రి కేటీఆర్

అమరుల త్యాగాలను స్మరించుకుందాం : మంత్రి కేటీఆర్
Highlights

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టీభవన్ లో జాతీయ జెండాను ఎగరేసిన మంత్రి కేటీఆర్, అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టీభవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగరేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా‎ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో నేడు విలీనం జరిగిందని.., పోరాటంలో వీరులు చేసిన త్యాగాలను స్మరించుకుందామన్నారు. జై తెలంగాణ, జై హింద్'' అని ట్వీట్ చేశారు. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story