ఈనెల 10 నాటికి సభ్యత్వం పూర్తి చేయాలి : కేటీఆర్

ఈనెల 10 నాటికి సభ్యత్వం పూర్తి చేయాలి : కేటీఆర్
x
Highlights

పార్టీ సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 10 వ తేదీలోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించింది. సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్...

పార్టీ సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నెల 10 వ తేదీలోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నిర్ణయించింది. సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మరో వైపు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలకు దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో సమీక్షించారు. తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలతో సమావేశమయ్యారు. తెలంగాణ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో నూ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభ్యత్వ నమోదు తీరుని కేటీఆర్ పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. 10 నుంచి 20వ తేదీలోగా బూత్, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కమిటీల్లోనూ 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉండాలన్నారు. కమిటీల ఏర్పాటులో భాగంగా అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు కేటీఆర్.

సమావేశం అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సభ్యులుగా చేరిన పలువురితో కేటీఆర్‌ స్వయంగా మాట్లాడారు. సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ.. బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నదని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సభ్యత్వ నమోదుపై సమీక్షిస్తూనే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories